Pawan Kalyan: బొత్స సంగతి తేలుస్తా... చంద్రబాబు అంటే జగన్ కు భయం: పవన్ కల్యాణ్

  • విజయనగం వచ్చి బొత్స సంగతేందో తేలుస్తా
  • మోదీ అంటే చంద్రబాబు, లోకేష్, జగన్ లకు భయం
  • కాన్షీరామే నాకు ఆదర్శం
వైసీపీ నేత బొత్స సత్యనారాయణపై జనసేనాని పవన్ కల్యాణ్ మండిపడ్డారు. తనపై బొత్స అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స నోరు అదుపులో పెట్టుకోవాలని అన్నారు. విజయనగరం వచ్చి ఆయన సంగతేందో తేలుస్తానని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే వైసీపీ అధినేత జగన్ కు భయమని చెప్పారు. చంద్రబాబు, లోకేష్, జగన్ లకు ప్రధాని మోదీ అంటే భయమని... తాను మాత్రం మోదీకి భయపడనని తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి బీఎస్పీని నిలబెట్టిన కాన్షీరామే తనకు ఆదర్శమని చెప్పారు. జనసేన అధికారంలోకి వస్తే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి పరుగెత్తుకొస్తారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ మాదిరి తాను లంచాలు అడగనని చెప్పారు. 
Pawan Kalyan
Botsa Satyanarayana
Chandrababu
Jagan
Nara Lokesh
modi
janasena

More Telugu News