Telugudesam: చంద్రబాబుతో కలసి కవిత ప్రచారం... పాత ఫొటోను వైరల్ చేస్తూ ప్రశ్నిస్తున్న తెలుగు తమ్ముళ్లు!

  • గతంలో టీడీపీ, టీఆర్ఎస్ మధ్య పొత్తు
  • చంద్రబాబుతో కలసి కవిత ప్రచారం
  • ఇప్పుడు దాన్ని చూపిస్తున్న టీడీపీ ఫ్యాన్స్
ఇది ఓ పాత ఫోటో... ఇప్పుడు కొత్తగా సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. గతంలో తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసిన వేళ తీసిన ఫోటో ఇది. నిజామాబాద్ ప్రాంతానికి ఎన్నికల ప్రచారానికి చంద్రబాబునాయుడు వెళ్లిన వేళ, ఆయనతో పాటు కేసీఆర్ కుమార్తె కవిత కూడా ప్రచారం చేశారు.

ఇప్పుడు ఆ ఫోటోను చూపిస్తూ, టీడీపీ వర్గాలు టీఆర్ఎస్ పై ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నాయి. సోషల్ మీడియా పుణ్యమాని ఈ ఫోటో ఇప్పుడు పలు గ్రూపుల్లో తిరుగుతోంది. "మూడు కండువాలు గప్పుకుని నిలవడ్డ గీమె ఎవరో చెప్పండి? మరి గానాడు గది ఆంధ్రా పార్టీ అని తెలవదా జతకట్టీరు... గియాల కాంగ్రెస్ వాలు కడితే నీతిమాలినోలైతరా?" అంటూ ప్రశ్నిస్తున్నారు కూడా.
Telugudesam
Telangana
Chandrababu
TRS
K Kavitha

More Telugu News