Pawan Kalyan: లాలు ప్రసాద్‌లా జగన్ జైలు ఊచలు లెక్కపెట్టుకోవడం ఖాయం: పవన్

  • జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి యువతకు దిశానిర్దేశం చేస్తారా?
  • పాపాలు చేశారు కాబట్టే వారికి మోదీ అంటే భయం
  • నాకెందుకు భయం.. చంపేస్తారా?
కుంభకోణాలతో జైలుకు వెళ్లొచ్చిన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరోమారు జైలుకు వెళ్లడం ఖాయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. ఇప్పటికే జైలుకు వెళ్లొచ్చిన జగన్ ఇక   యువతకు ఏం దిశానిర్దేశం చేస్తారని ప్రశ్నించారు. సీబీఐ, ఈడీ కేసులున్న జగన్ ఆర్జేడీ అధినేత లాలు ప్రసాద్ యాదవ్‌లా జైలుకెళ్లడం ఖాయమన్నారు. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన కవాతు, బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను ఏ ఉద్దేశంతో చంద్రబాబుకు మద్దతు ఇచ్చానో ఇప్పుడది  నెరవేరడం లేదన్నారు. అవినీతి రహిత పాలన అందించాలని, రాజధాని రైతులను ఇబ్బంది పెట్టొద్దని చంద్రబాబును కోరానన్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదన్నారు. పాపాలు చేశారు కాబట్టే చంద్రబాబు, జగన్‌లకు మోదీ అంటే భయమని, తనకు ఎటువంటి భయాలు లేవన్నారు. చంపేస్తామన్నా తాను బెదిరేదిలేదని పవన్ స్పష్టం చేశారు.
Pawan Kalyan
Jana Sena
Jagan
Chandrababu
Narendra Modi
Anantapur District

More Telugu News