Chandrababu: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ.. కాంగ్రెస్ చీఫ్ రాహుల్

  • తెలంగాణలో చివరి దశకు ఎన్నికల ప్రచారం
  • ఎల్బీ స్టేడియంలో బీజేపీ భారీ బహిరంగ సభ
  • హైదరాబాద్‌లో రాహుల్-చంద్రబాబు రోడ్ షో
తెలంగాణలో ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంటున్న తరుణంలో నేతలు జోరు పెంచారు. గెలుపు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్న నేతలు ప్రచారంలో ఊపిరి సలపకుండా ఉన్నారు. ఇందులో భాగంగా నేడు ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌కు రానున్నారు. నేటి మధ్యాహ్నం మూడు గంటలకు ఎల్బీ స్టేడియంలో జరగనున్న బీజేపీ భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారు.

గద్వాల, తాండూరులలో కాంగ్రెస్ నిర్వహించనున్న బహిరంగ సభల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, కూకట్‌పల్లిలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, రాహుల్ కలిసి జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, రహ్మత్‌నగర్, మూసాపేట సభల్లో పాల్గొననున్నారు.  
Chandrababu
Rahul Gandhi
Narendra Modi
Telangana
Hyderabad

More Telugu News