Chandrababu: ఆ విషయం చాలా మంది ఆంధ్రా ప్రాంత మిత్రులు నాకు వ్యక్తిగతంగా చెప్పారు: సీఎం కేసీఆర్

  • ప్రజల మధ్య విభేదాలు పెడుతోంది బాబు కాదా?
  • జంటనగరాల ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలి
  • మేము ప్రజలను ప్రజలుగా చూస్తున్నాం
ఈ చంద్రబాబునాయుడు అనవసరంగా ఇక్కడికొచ్చి తమకో ట్రేడ్ పెట్టారని
చాలా మంది ఆంధ్రా ప్రాంత మిత్రులు తనకు వ్యక్తిగతంగా చెప్పారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన ప్రజాఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘మా కొక మసి పూసి.. మాకో ట్రేడ్ పెట్టి.. మా నొసటికొక బోర్డు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు.. బద్నామ్ చేస్తున్నారు.. మీకు లేదు ఆ భావన అని’ అని చాలా మంది ఆంధ్రా ప్రాంత మిత్రులు నాకు వ్యక్తిగతంగా చెప్పారు.

స్వార్థ, కుటిల, కుళ్లు రాజకీయం కోసం హైదరాబాద్ లో ఉన్న తెలుగు ప్రజల మధ్య విభేదాలు పెడుతోంది చంద్రబాబునాయడు కాదా? జంటనగరాల ప్రజలు ఆయనకు బుద్ధి చెప్పాలి. ఎందుకంటే, మన నగరం, మనం బాగా ఉన్నాం, ముందుకు పోతున్నాం. చిల్లర రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీకి లేవు. ప్రజలను ప్రజలుగా చూస్తున్నాం. హైదరాబాద్ లో నివసిస్తున్న ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాల వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. ‘మేము ఆంధ్రా వాళ్లం’ అనే భావన వీడండి. హైదరాబాదీలమని గర్వంగా చెప్పండి’ అని కేసీఆర్ సూచించారు.
Chandrababu
kcr
Hyderabad
Telugudesam

More Telugu News