Chandrababu: చంద్రబాబు ఎంత తాపత్రయ పడ్డా ఫలితం ఉండదు: మంత్రి కేటీఆర్

  • సెటిలర్లంతా మా వైపే ఉన్నారు
  • గ్రేటర్ హైదరాబాద్ లో 17 స్థానాలు గెలుస్తాం
  • శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ లో కూడా
తెలంగాణలో చంద్రబాబు ఎంత తాపత్రయపడ్డా ఫలితం ఉండదని, సెటిలర్లందరూ టీఆర్ఎస్ వైపే ఉన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో సభ ప్రారంభానికి ముందు ఆయన మీడియాతో ముచ్చటించారు. గ్రేటర్ హైదరాబాద్ లో 17 స్థానాలు టీఆర్ఎస్ గెలుస్తుందని, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయమని అన్నారు.

నాగార్జునసాగర్ లో జానారెడ్డి, కొడంగల్ లో రేవంత్ రెడ్డి, మధిరలో భట్టి విక్రమార్క ఓటమి పాలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. సిరిసిల్లలో ఈసారి తనకు యాభై వేలకు పైగా మెజార్టీ లభిస్తుందని చెప్పారు. అవసరమైతే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా రాజకీయాలు చేస్తామని, అక్కడ కూడా పర్యటిస్తామని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Chandrababu
KTR
Telugudesam
TRS

More Telugu News