Kurnool District: అత్తాకోడళ్ల మధ్య ఘర్షణ.. ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య

  • అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన గొడవ
  • పురుగుల మందు తాగిన అత్తాకోడళ్లు
  • చికిత్స పొందుతూ మృతి
అత్తాకోడళ్ల మధ్య తలెత్తిన చిన్నపాటి ఘర్షణ వారిద్దరూ ఆత్మహత్య చేసుకునే వరకూ వెళ్లింది. కర్నూలు జిల్లాలోని బండి ఆత్మకూరు మండలం సోమయాజులపల్లె గ్రామానికి చెందిన చిన్న హుస్సేన్‌, వెంకటలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. కొంతకాలంగా వెంకటలక్ష్మికి, ఆమె అత్త కళావతికి మధ్య ఘర్షణ జరుగుతోంది.

నేడు హుస్సేన్ పొలం పనులకు వెళ్లిన సమయంలో మరోసారి అత్తాకోడళ్ల మధ్య గొడవ తలెత్తింది. క్షణికావేశంలో అత్త పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన వెంటనే కోడలు కూడా పురుగుల మందు తాగింది. విషయాన్ని గమనించిన స్థానికులు నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అత్తాకోడళ్లిద్దరూ మరణించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Kurnool District
somayajulapalli
Kalvathi
Venkata Lakshmi
Suiside

More Telugu News