patancheruvu: నాడు పవర్ హాలిడే.. నేడు పవర్ డే: సీఎం కేసీఆర్

  • నాడు కాంగ్రెస్ హయాంలో పవర్ హాలిడే ఉండేది
  • నేడు ప్రతిరోజూ పవర్ ఉంటుంది
  • ఇక్కడి ఆంధ్రా వాళ్లందరూ తెలంగాణ బిడ్డలే
నాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో తెలంగాణలో పవర్ హాలిడే ఉండేదని, నేడు తమ హయాంలో ప్రతిరోజూ పవర్ డేనే అని సీఎం కేసీఆర్ అన్నారు. పటాన్ చెరువులో నిర్వహించిన టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ లో ప్రతిరోజూ పవర్ డేనే అని, పరిశ్రమల్లో మూడు షిఫ్ట్ లు కార్మికులు పని చేస్తున్నారని, ఓపికున్న కార్మికులు ఓవర్ టైమ్ కూడా చేసుకునే పరిస్థితులు ఉన్నాయని అన్నారు.

పటాన్ చెరువు, బీహెచ్ఈఎల్ లు మినీ ఇండియాలతో సమానమని, ఇక్కడ ఆంధ్రా, రాయల సీమ సోదరులతో పాటు దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వారు కూడా ఉన్నారని అన్నారు. ఇక్కడ నివసిస్తున్న ఆంధ్రా, రాయలసీమకు చెందిన వారు తాము ఆంధ్రావాళ్లమనే భావనని వీడాలని, అందరూ, తెలంగాణ బిడ్డలే అని గుర్తుంచుకోవాలని సూచించారు. సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఐదేళ్లలో ప్రజలు కోరికలు నెరవేరతాయని అన్నారు.
patancheruvu
TRS
kcr
congress

More Telugu News