Boinapally: మూకుమ్మడి రాజీనామాలతో టీఆర్ఎస్‌కు భారీ షాక్

  • సముచిత స్థానం ఇవ్వలేదని ఆవేదన
  • పార్టీ కార్యాలయంలోని ఫ్లెక్సీలు చింపి నిరసన
  • కృష్ణారావుకు వ్యతిరేకంగా నేతల రాజీనామా
ఎన్నికలకు మరో నాలుగు రోజులే సమయముంది. పార్టీలన్నీ ప్రచార జోరును కొనసాగిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మూకుమ్మడి రాజీనామాలు టీఆర్ఎస్‌కు భారీ షాక్‌ ఇచ్చాయి. కూకట్‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు వ్యతిరేకంగా పలువురు టీఆర్ఎస్ నేతలు పార్టీకి రాజీనామా చేశారు.

బోయినపల్లి టీఆర్ఎస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కుతాడి రవికుమార్, డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు ఖాదిర్, డివిజన్ మైనార్టీ అధ్యక్షుడు ఖాదిర్, పోచయ్య, పల్ల కుమార్, అంజయ్యగౌడ్ ఆధ్వర్యంలో మూకుమ్మడి రాజీనామాలు చేశారు. కృష్ణారావు పార్టీలో చేరినప్పటి నుంచి తమకు సముచిత స్థానం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. పార్టీ కార్యాలయంలోని ఫ్లెక్సీలు చింపి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం పోరాడిన తమకే సముచిత స్థానం ఇవ్వకపోవడంతోనే రాజీనామా చేసినట్టు వెల్లడించారు.
Boinapally
Kukatpally
Khadir
Krishna Rao
TRS

More Telugu News