Chandrababu: నేను హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది కేసీఆర్ కుటుంబం కోసం కాదు!: సీఎం చంద్రబాబు

  • తెలంగాణ రాష్ట్రం అంటే నాకు చాలా ఇష్టం
  • నా వల్లే ప్రజలంతా హైదరాబాద్ వచ్చి నివసిస్తున్నారు
  • కేసీఆర్, కేటీఆర్ బెదిరింపులకు భయపడను
కేసీఆర్, కేటీఆర్ బెదిరింపులకు తాను భయపడే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం మలక్ పేటలో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అంటే తనకు చాలా ఇష్టమని, తాను చేసిన అభివృద్ధి వల్లే ప్రజలంతా హైదరాబాద్ వచ్చి నివసిస్తున్నారని అన్నారు.

 తాను హైదరాబాద్ ను అభివృద్ధి చేసింది, కేసీఆర్ కుటుంబం కోసం కాదని, ఆయన పాలనలో ధనిక రాష్ట్రం కాస్తా, అప్పుల రాష్ట్రంగా మారిందని, తాను ఆదాయం పెంచిపోతే, కేసీఆర్ దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు.హైదరాబాద్ కు కృష్ణానది నీళ్లు తీసుకువచ్చి, ఇక్కడి నీటి సమస్యను తీర్చిన విషయాన్ని ప్రస్తావించారు.

విభజన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం న్యాయం చేయాలని, తెలంగాణ ప్రజలకు సామాజిక న్యాయం చేసేందుకే వచ్చానని అన్నారు. దేశంలో, తెలంగాణలో యువతకు మంచి అవకాశాలు రావాలంటే పెద్ద మోదీ, చిన్నమోదీలు అధికారంలోకి రాకూడదని, ఈ విషయాన్ని యువత గుర్తుంచుకోవాలని కోరారు. 
Chandrababu
Hyderabad
kcr
TRS

More Telugu News