TRS: టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై ఈసీ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు?: రేవంత్ రెడ్డి

  • నరేందర్ రెడ్డి రూ.5 కోట్ల ఎన్నికల ఖర్చు చేశారు
  • గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బు పంచుతోంది  
  • నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలి
కొడంగల్ టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి నిబంధనలు అతిక్రమించి ఎన్నికల ఖర్చు చేస్తున్నారని, ఆయనపై ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కొడంగల్ లో ఆయన మాట్లాడుతూ, నరేందర్ రెడ్డి రూ.5 కోట్ల ఎన్నికల ఖర్చు చేశారని ఆరోపించారు.

కొడంగల్ లో టీఆర్ఎస్ గెలుపు కోసం ఇతర పార్టీల నేతలను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ వాహనాల్లో టీఆర్ఎస్ డబ్బు తరలిస్తోందని, టీఆర్ఎస్ నేతల నివాసాల్లో రూ.17.50 కోట్ల నగదును అధికారులు దాడి చేసి పట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. నరేందర్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించి పోటీ నుంచి ఎందుకు తొలగించడం లేదని ప్రశ్నించారు. 
TRS
congress
patnam
Revanth Reddy

More Telugu News