Ganta Srinivasa Rao: ఏపీకి రా... పోటీ చెయ్: కేటీఆర్ కు గంటా కౌంటర్

  • ఏపీలో బలముంటే పోటీ చేయవచ్చు
  • కాంగ్రెస్, టీడీపీల కలయికను చూసి టీఆర్ఎస్ కు భయం
  • చంద్రబాబు ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోందన్న గంటా
తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడుతున్నందున, తమ పార్టీ రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వేలు పెడుతుందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి గంటా శ్రీనివాస్ స్పందించారు. కేటీఆర్, కేసీఆర్ లకు ఏపీలో బలముంటే వచ్చి పోటీ చేయవచ్చని సూచించారు.  టీడీపీ, కాంగ్రెస్ లు కలసి పోటీ చేస్తున్నందునే, ఓటమి భయంతో కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లో చంద్రబాబు ప్రచారానికి అనూహ్య స్పందన వస్తోందని, దీన్ని చూసిన టీఆర్ఎస్ నేతలకు భయం వేస్తోందని అన్నారు. హైదరాబాద్ కు చంద్రబాబు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారని, గతంలో కేసీఆర్ సైతం చంద్రబాబును ఎంతగా పొగిడారో, ఆన్ లైన్లో వీడియోలు ఉన్నాయని అన్నారు.
Ganta Srinivasa Rao
Hyderabad
Chandrababu
KCR
KTR

More Telugu News