NTR: ఘనకీర్తిసాంధ్ర, విజితాఖిలాంధ్ర... అంటూ వచ్చేసిన 'ఎన్టీఆర్' తొలి పాట... లిరిక్స్ వీడియో!

  • ఈ ఉదయం లిరికల్ వీడియోను విడుదల చేసిన చిత్ర టీమ్
  • ఎన్టీఆర్ పోషించిన పలు పాత్రల పేర్లు జొప్పించిన కీరవాణి
  • వినసొంపుగా పాడిన కైలాష్ ఖేర్ 
బాలకృష్ణ హీరోగా, టాలీవుడ్ లోని పలు ప్రముఖ హీరో, హీరోయిన్లు నటిస్తున్న 'ఎన్టీఆర్' తొలి పాట లిరికల్ వీడియో కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ఘనకీర్తిసాంధ్ర, విజితాఖిలాంధ్ర, జనతా సుదీంధ్ర, మణిదీపకా... అంటూ సాగే పాట లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. కీరవాణి స్వరపరచిన ఈ పాటలో మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ ను గుర్తు చేస్తూ, ఆయన పోషించిన పలు పాత్రల పేర్లను చేర్చారు. కే శివదత్త, డాక్టర్ కే రామకృష్ణలు ఈ పాటను రాయగా, కైలాష్ ఖేర్ ఆలపించాడు.

"భీమసేన వీరార్జున కృష్ణ దానకర్ణ మానధన సుయోధన భీష్మ బృహన్నల విశ్వామిత్ర లంకేశ్వర దశకంఠరావణా, సురాధి పురాణ పురుష భూమికా పోషకా..." అనడం బాగుంది. రిలీజైన నిమిషాల వ్యవధిలోనే లక్షల వ్యూస్ తెచ్చుకున్న 'కథానాయకుడు' తొలి పాట లిరికల్ వీడియోను మీరూ చూడండి.
NTR
Biopic
Balakrishna
Liricle Song
Video

More Telugu News