Bhadradri Kothagudem District: త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ను అడ్డుకున్న తెలంగాణ పోలీసులు!

  • ఖమ్మంకు వచ్చిన మాణిక్ సర్కారు
  • దుమ్ముగూడెం సమీపంలో ప్రచారం
  • ప్రసంగాన్ని అడ్డుకున్న పోలీసులు
తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్థులకు, ప్రజా ఫ్రంట్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు వచ్చిన త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ ను పోలీసులు అడ్డుకున్నారు. తమ నుంచి అనుమతి లేకుండానే రోడ్ షో, ప్రచారం నిర్వహిస్తున్నారంటూ ఆయన్ను తిరగనీయకుండా ఆపేశారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలో జరిగింది.

ముందస్తు అనుమతి తీసుకోకపోవడంతో, ట్రాఫిక్ ను మళ్లించలేకపోయామని, ఈ రోడ్ షోతో ట్రాఫిక్ కు అవాంతరాలు ఏర్పడుతున్నాయని పోలీసులు, మాణిక్ సర్కార్ ను అడ్డుకోవడంతో ఆయన తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి, ఖమ్మం వెళ్లిపోయారు. అంతకుముందు భద్రాచలం ఏఎస్పీ సంగా రామ్ సింగ్ పాటిల్, మాణిక్ సర్కారు వద్దకు వెళ్లి, పరిస్థితిని వివరించి, మరోసారి రోడ్ షో పెట్టుకోవాలని సూచించారు.
Bhadradri Kothagudem District
Khammam District
Telangana
Manik Sarkar

More Telugu News