Telangana: కేసీఆర్, కేటీఆర్... ఈ ఒక్కటీ గుర్తు పెట్టుకోండి: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్సేనని కేసీఆర్, కేటీఆర్ లు గుర్తు పెట్టుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. నాడు కేవలం ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్ పార్టీతో తెలంగాణ ఎలా వస్తుందని ప్రశ్నించిన ఆయన, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తలచుకున్నారు కాబట్టే రాష్ట్రం కావాలన్న తెలంగాణ వాసుల కల నెరవేరిందని చెప్పారు.

నందమూరి సుహాసినితో కలసి రోడ్ షో నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, కేసీఆర్, కేటీఆర్ లకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం దేశాన్ని భ్రస్టు పట్టించగా, కేసీఆర్ వారికి వత్తాసు పలుకుతున్నారని, జరుగుతున్న పరిణామాలను ప్రజలు గమనించాలని కోరారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగ పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపామని అన్నారు. ఈ వారం చివరిలో జరిగే ఎన్నికల్లో ప్రజా ఫ్రంట్ విజయం తథ్యమని చెప్పారు.
Go Back to Shorts
Telangana
Chandrababu
KCR
Sonia Gandhi

More Telugu News