Lagadapati Rajagopal: లగడపాటి సర్వేపై కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ స్పందన

  • ఎట్టి పరిస్థితుల్లో హంగ్ ఏర్పడదు
  • ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తున్న కూటమి
  • మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తెలంగాణ ఎన్నికల్లో 8 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందుతారని.. వారిలో ఇద్దరి పేర్లు కూడా వెల్లడించిన విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో హంగ్ ఏర్పడే పరిస్థితి లేదని.. స్పష్టమైన మెజారిటీతో ఏదో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని లగడపాటి వెల్లడించారు. ఈ సర్వేపై కర్ణాటక కాంగ్రెస్ కీలక నేత, మంత్రి డీకే శివకుమార్ స్పందించారు.

లగడపాటి సర్వేకు మద్దతుగా మాట్లాడారు. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో హంగ్ ఏర్పడదని.. ఎన్నికలకు ముందు నుంచే మహాకూటమి అన్ని పార్టీలను కలుపుకుని ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళుతోందన్నారు. మహాకూటమి కచ్చితంగా గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. ఇక కూటమికి చెందిన సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని డీకే శివకుమార్ తెలిపారు.
Lagadapati Rajagopal
DK Shiva kumar
Rahul Gandhi
Chandrababu
Telangana

More Telugu News