lagadapati: లగడపాటి రాజగోపాల్ పై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు

  • పది మంది ఇండిపెండెంట్లు గెలుస్తారన్న లగడపాటి  
  • ఈ వ్యాఖ్యలు ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధం
  • ఈ తరహా ప్రకటనలకు ఇది సరైన సమయం కాదు
తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో పది మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుస్తారని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఎన్నికల సంఘానికి టీఆర్ఎస్ ఈరోజు ఫిర్యాదు చేసింది. వారం రోజుల్లో జరగబోయే ఎన్నికలను ప్రభావితం చేసేలా లగడపాటి వ్యాఖ్యలు ఉన్నాయని టీఆర్ఎస్ ఎన్నికల సమన్వయ కమిటీ తరపున దండె విఠల్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇలా వ్యాఖ్యలు చేయడం ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధమని, ఈ వ్యాఖ్యలను టీవీల్లో ప్రసారం చేశారని అన్నారు. ఈ తరహా ప్రకటనలకు ఇది సరైన సమయం కాదని, రోజుకు ఇద్దరు ఇండిపెండెంట్లకు సంబంధించిన సర్వే ఫలితాలను ప్రకటిస్తానని లగడపాటి పేర్కొనడంపై ఆ ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారు.
lagadapati
TRS
Telangana electon commission

More Telugu News