Andhra Pradesh: హైదరాబాద్ కు చేరుకున్న చంద్రబాబు.. మరికాసేపట్లో రాజేంద్రనగర్ లో ప్రచారం!

  • మహాకూటమి అభ్యర్థికి ప్రచారం
  • అల్కాపురి క్రాస్ రోడ్ నుంచి ప్రారంభం
  • ఏర్పాట్లు పూర్తిచేసిన మహాకూటమి నేతలు
తెలంగాణలో రెండో విడత ఎన్నికల ప్రచారం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ కు చేరుకున్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారాన్ని మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. చంద్రబాబు రోడ్ షో  ఇక్కడి అల్కాపురి క్రాస్ రోడ్స్ లోని చింతచెట్టు సెంటర్ నుంచి ప్రారంభం కానుంది.

అనంతరం చంద్రబాబు యాత్ర సచివాలయం కాలనీ, గోల్డెన్ టెంపుల్, పైప్‌లైన్ రోడ్‌, హుడా కాలనీ, ఓయూ కాలనీ, పంచవటి కాలనీ మీదుగా మణికొండలోని మర్రిచెట్టు సెంటర్ వరకూ సాగనుంది. ఆ తర్వాత ఇక్కడ జరిగే సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక్కడి సమావేశం పూర్తయ్యాక లాంకోహిల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మీదుగా, చిత్రపురి హిల్స్‌కు బాబు చేరుకుంటారు. అక్కడ జరిగే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. కాగా చంద్రబాబు తెలంగాణ పర్యటన నేపథ్యంలో మహాకూటమి నేతలు ఏర్పాట్లను పూర్తిచేశారు.
Andhra Pradesh
Telangana
Chandrababu
Telugudesam

More Telugu News