Chandrababu: జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు!

  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పవన్
  • టీడీపీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన నేత
  • చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా బాధ్యతల నిర్వహణ
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఈ రోజు జనసేన పార్టీలో చేరారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో తనకు తగిన గౌరవం లభించడం లేదని ఆరోపిస్తూ రావెల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి ఇటీవల రాజీనామా సమర్పించారు. 2014లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్ పై గెలుపొందారు.

అనంతరం చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2017, మార్చిలో జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా సీఎం చంద్రబాబు ఆయనకు ఉద్వాసన పలికారు. అంతేకాకుండా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పలు విషయాల్లో రావెలకు అభిప్రాయభేదాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో టీడీపీని వీడిన రావెల కిశోర్ బాబు జనసేన తీర్థం పుచ్చుకున్నారు.
Chandrababu
janasena
Pawan Kalyan
Ravela Kishore Babu
joined

More Telugu News