byreddy rajasekhar reddy: హైకమాండ్ ఆదేశిస్తే.. జగన్ పై పోటీ చేస్తా: బైరెడ్డి రాజశేఖరరెడ్డి

  • పార్టీ విధానాలు నచ్చే కాంగ్రెస్ లో చేరా
  • రాహుల్ ప్రధాని అయితే.. తొలి సంతకం ప్రత్యేక హోదాపైనే
  • బీజేపీ పాలనలో దేశ ప్రజలంతా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
పార్టీ విధానాలు నచ్చే తాను కాంగ్రెస్ లో చేరానని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పంటల పెట్టుబడికి రుణాలు మంజూరు చేస్తామని, ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీకి ప్రత్యేక హోదాపైనే అని తెలిపారు. హైకమాండ్ ఆదేశిస్తే వైసీపీ అధినేత జగన్ పై పోటీ చేస్తానని చెప్పారు. బీజేపీ పాలనలో దేశ ప్రజలంతా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని... రానున్న ఎన్నికల్లో బీజేపీ ఓటమి, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. 
byreddy rajasekhar reddy
congress
jagan
Rahul Gandhi
ysrcp
bjp
nandikotkur

More Telugu News