Nokia 7.1: అద్భుత ఫీచర్లతో నోకియా నుండి మరో స్మార్ట్ ఫోన్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన హెచ్.డీ.ఎఫ్.సీ, ఎయిర్ టెల్!

షార్ట్స్‌లో చూడండి
హెచ్ఎండీ గ్లోబల్ సంస్థ గత నెల లండన్ లో విడుదల చేసిన నోకియా 7.1 స్మార్ట్ ఫోన్ ని తాజాగా భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈనెల 7నుండి వినియోగదారులకి అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధరను రూ.19,999గా నిర్ణయించారు.

భారీ బ్యాటరీ బ్యాకప్, డ్యూయల్ కెమెరాలతో పాటు పలు ఆకట్టుకునే ఫీచర్లు ఉన్న ఈ ఫోన్ పై ఎయిర్ టెల్, హెచ్.డీ.ఎఫ్.సీ సంస్థలు పలు బంపర్ ఆఫర్లని ప్రకటించాయి. హెచ్.డీ.ఎఫ్.సీ కార్డు వినియోగదారులు 10% క్యాష్ బ్యాక్ పొందనుండగా, ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.199 రీచార్జీపై 1 టీబీ 4జీ డేటాని పొందనున్నారు.

నోకియా 7.1 ప్రత్యేకతలు:

  • 5.84"  ఫుల్ హెడ్ ప్లస్ డిస్ప్లే (1080 x 2280 పిక్సల్స్)
  • 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
  • స్నాప్ డ్రాగన్ 636 ప్రాసెసర్
  • 12/5 మెగాపిక్సెల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు
  • 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
  • 3060 ఎంఏహెచ్ బ్యాటరీ
Go Back to Shorts
Nokia 7.1
India
smartphone
Tech-News
technology

More Telugu News