rajani: ఇన్నేళ్ల రజనీ కెరియర్లో ఆయనకి నచ్చిన హీరోయిన్ ఆమేనట!
- జయలక్ష్మి తెలుగు అమ్మాయి
- 'అంతులేని కథ'తో పాప్యులర్
- విషాదంతో ముగిసిన జీవితం
రజనీకాంత్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వున్నారు. ఆయన నటించిన ఎన్నో సినిమాలు సంచలన విజయాలను సాధించాయి. సుదీర్ఘమైన ఆయన కెరియర్లో ఎంతోమంది కథానాయికలు ఆయన సరసన నటించారు. అలాంటి రజనీకాంత్ కి 'మీకు నచ్చిన బెస్ట్ ఫీమేల్ కో స్టార్ ఎవరు?' అనే ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆయనకి ఎదురైంది. ఎంతోమంది స్టార్ హీరోయిన్స్ ఆయనతో కలిసి నటించారు గనుక, వాళ్లలో ఎవరో ఒకరి పేరు చెబుతారు అని అంతా భావించారు.
కానీ ఆయన ఎవరూ ఊహించని విధంగా 'ఫటా ఫట్ జయలక్ష్మి' పేరు చెప్పారు. తనకి నచ్చిన బెస్ట్ హీరోయిన్ ఆమేనని అన్నారు. 'జయలక్ష్మి' తెలుగు అమ్మాయి .. 'అంతులేని కథ' సినిమాలో జీవితాన్ని చాలా తేలికగా తీసుకుంటూ ఆమె 'ఫటా ఫట్' అంటూ ఉంటుంది. ఆ మేనరిజం జనంలోకి బాగా వెళ్లడంతో ఆమె 'ఫటా ఫట్ జయలక్ష్మి'గా పాప్యులర్ అయింది. రజనీకాంత్ తో కలిసి ఆమె కొన్ని సినిమాలు చేసింది. తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించిన ఆమె జీవితం విషాదాంతమే అయింది.