ciggarate: సిగరెట్ ను అలా స్టయిల్ గా కాల్చడం అతని వద్దే నేర్చుకున్నా!: రజనీకాంత్

  • ఈ సిగ్నేచర్ స్టయిల్ కోసం ప్రాక్టీస్ చేశా
  • దానికి నా మేనరిజాన్ని జోడించాను
  • అభిమానులకు ఇది తెగ నచ్చేసింది
సూపర్ స్టార్ రజనీకాంత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. తన స్టెయిల్, ప్రత్యేకమైన మేనరిజంతో రజనీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. వీటిలో డైలాగులతో పాటు రజనీ సిగరెట్ ముట్టించే స్టయిల్ కూడా ఒకటి. తాను నటించిన పలు సినిమాల్లో ఈ ‘సిగరెట్ సిగ్నేచర్ మూమెంట్’ను రజనీ చేశారు. తాజాగా రోబో 2.ఓ సినిమాలో సైతం రజనీ ఈ ఫీట్ చేయడంతో థియేటర్లు అభిమానుల కేకలు, అరుపులతో మార్మోగాయి. అయితే సిగరెట్ ను ఇలా స్టయిల్ గా తాగడం వెనుకున్న అసలు కారణాన్ని రజనీకాంత్ తాజాగా బయటపెట్టారు.

ఈ స్టయిల్ ను తాను బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా దగ్గర నేర్చుకున్నట్లు రజనీకాంత్ తెలిపారు. శతృఘ్న సిన్హా ఓసారి చూపించాక తాను బాగా ప్రాక్టీస్ చేశాననీ, చివరికి తన మేనరిజాన్ని దానికి జోడించానని వెల్లడించారు. ఇది ప్రేక్షకులతో పాటు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుందని పేర్కొన్నారు. సిగరెట్ ను స్టయిల్ గా నోట్లో విసరడానికి టైమింగ్, సందర్భం లాంటివి చాలా అవసరమని రజనీ వ్యాఖ్యానించారు. రజనీకాంత్, అమీజాక్సన్ జంటగా శంకర్ దర్శకత్వం వహించిన రోబో 2.ఓ చిత్రం ఇటీవల విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.
ciggarate
Rajinikanth
kollywood
smoking
style
satrungna sinha

More Telugu News