Sonia Gandhi: తెలంగాణలో సోనియా రెండో విడత ఎన్నికల ప్రచారానికి ప్రయత్నాలు

  • ప్రచారానికి చివరి రోజైన ఐదో తేదీన సోనియా సభ
  • 3న రాహుల్‌గాంధీ, 4న మాజీ ప్రధాని మన్మోహన్‌ సభలు
  • సోనియా రాకపోతే మరో రోజు రాహుల్‌ ప్రచారం
తెలంగాణలో సోనియాగాంధీ రెండో సారి పర్యటించే అవకాశాలు వున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజా కూటమి గెలుపు ఖాయమని విశ్వసిస్తున్న కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీని మరోసారి ఎన్నికల ప్రచారానికి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన సోనియా సభతో ఆశించిన ప్రయోజనం సమకూరిందని భావిస్తున్న ఆ పార్టీ నేతలు మరో సభ నిర్వహిస్తే మెరుగైన ఫలితాలు రాబట్టుకోవచ్చని చెబుతున్నట్టు సమాచారం.

దీంతో ప్రచారానికి చివరి రోజైన ఐదో తేదీన సోనియా గాంధీ రెండో విడత ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 3వ తేదీన గద్వాల, తాండూరుల్లో రాహుల్‌ సభలు, 4న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సభలు ఇప్పటికే ఖరారయ్యాయి. వీటికి అదనంగా చివరి రోజు సోనియా సభ కూడా ఉంటుందని పార్టీ వర్గాల సమాచారం. ఒకవేళ సోనియాగాంధీ రాలేకపోతే మరో రోజు రాహుల్‌ గాంధీ తెలంగాణలో పర్యటించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Sonia Gandhi
election campain

More Telugu News