Balakrishna: నేడు హైదరాబాద్‌లో బాలయ్య ప్రచారం.. సుహాసిని కోసం ప్రచారం డౌటే!

  • సనత్‌నగర్, ముషీరాబాద్‌లో బాలయ్య ప్రచారం
  • ఇంకా ఖరారు కాని కూకట్‌పల్లి ప్రచారం 
  • జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ స్పష్టత కరవు
ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నేడు హైదరాబాద్‌లో ప్రచారం నిర్వహించనున్నారు. తొలుత సనత్‌నగర్‌లో టీడీపీ అభ్యర్థి కూన వెంకటేశ్‌గౌడ్ తరపున ప్రచారం నిర్వహించనున్న ఆయన అనంతరం ముషీరాబాద్‌లో ప్రజాకూటమి అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తారు.

కూకట్‌పల్లిలో బరిలో ఉన్న బాలకృష్ణ అన్న కుమార్తె నందమూరి సుహాసిని కోసం బాలయ్య ఎప్పుడు ప్రచారం చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. నిజానికి శుక్రవారమే (30న) కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారని చెప్పినా ఆయన రాలేదు. ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్‌లో బాలయ్య బిజీగా ఉన్నందునే ప్రచారానికి రాలేకపోయారని చెబుతున్నారు.

మరోవైపు, సుహాసినికి మద్దతుగా కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, వీరి ప్రచారం విషయంలోనూ స్పష్టత లేదు. ప్రచారానికి మరో నాలుగు రోజులు గడువు ఉండడంతో ఈలోపు ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాగా, నేటి బాలకృష్ణ ప్రచారం కోసం టీడీపీ నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. బాలయ్య ప్రచారంలో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నట్టు సమాచారం.  
Balakrishna
Hyderabad
Sanathnagar
musheerabad
Nandamuri suhasini

More Telugu News