New Delhi: ప్రతి రాష్ట్రంలోనూ రైతు సమస్యలు ఉన్నాయి.. వాటిని పరిష్కరించాల్సింది ప్రభుత్వాలే: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

  • కిసాన్ ర్యాలీకి అన్ని రాష్ట్రాల రైతులు హాజరయ్యారు
  • ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే కళ్లు తెరవాలి
  • నాయకులు, రైతులు కలిసి పరిష్కారం కనుక్కోవాలి
ప్రతి రాష్ట్రంలోనూ రైతు సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత ఆయా ప్రభుత్వాలపై ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. ఢిల్లీలో కిసాన్ ర్యాలీకి ఆయన సంఘీభావం ప్రకటించారు. ఢిల్లీకి వెళ్లిన ఆయన ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఈ ర్యాలీకి అన్ని రాష్ట్రాల రైతులు హాజరయ్యారని చెప్పారు. పంటలు పండించే రైతు పరిస్థితి మెరుగుపడాలని, ఇప్పటికైనా ప్రభుత్వాలు తక్షణమే కళ్లు తెరవాలని కోరారు. నాయకులు, రైతులు కలిసి ఈ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలని సూచించారు. ఆ విధంగా చేస్తే, నేటి యువతరాన్ని వ్యవసాయం వైపు తీసుకొచ్చే వీలుంటుందని అభిప్రాయపడ్డారు.

 ఈ సందర్భంగా కౌలు రైతుల గురించి ఆయన ప్రస్తావిస్తూ, వీరు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారిని రైతులుగా గుర్తించి పంట రుణాలు ఇవ్వగలిగితే వారి పరిస్థితి మెరుగుపడుతుందని అన్నారు.
New Delhi
kisan rally
cbi
ex jd
laxmi narayana

More Telugu News