Telangana: తెలంగాణలో బీజేపీని తక్కువ అంచనా వేయొద్దు: కె.లక్ష్మణ్

  • డిసెంబర్ 3న ఎల్బీ స్టేడియంలో మోదీ సభ  
  • సభ ఏర్పాట్లను పరిశీలించాం
  • ఈ సభతో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి
తెలంగాణలో భారతీయ జనతా పార్టీని తక్కువ అంచనా వేయొద్దని, త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని టీ-బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. డిసెంబర్ 3న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న బీజేపీ బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.

 ఈ సందర్భంగా అక్కడి ఏర్పాట్లను లక్ష్మణ్, పోలీసులు, ఎస్పీజీ అధికారులు పరిశీలించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, సభకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. మోదీ సభతో తెలంగాణలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయని, ఎన్నికల్లో తమ విజయం ఖాయమని జోస్యం చెప్పారు.
Telangana
modi
k.laxman
bjp

More Telugu News