ar rehaman: ఈ పాట రిథమ్ ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా: ఏ.ఆర్. రెహమాన్

  • 'సర్వం తాళమయం' సినిమా నుండి టైటిల్ ట్రాక్
  • ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి స్పందన 
  • సంగీతాన్ని అందించిన రెహమాన్
రాజీవ్ మీనన్ దర్శకత్వంలో జీవీ ప్రకాష్‌ కుమార్ కథానాయకుడిగా నటించిన 'సర్వం తాళమయం' సినిమా నుండి టైటిల్ ట్రాక్ ని కాసేపటిక్రితం సంగీత దర్శకుడు రెహమాన్ తన ట్విట్టర్ ఖాతాలో విడుదల చేశారు. మైండ్‌స్క్రీన్ సినిమాస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ని విడుదల చేయగా అది ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. 'మొదలయ్యే హృదయం సవ్వడి గర్భాన తొలిగా.. గర్వాలా ఆటే ఆడి ఆగేనే తుదిగా.. గగనాలే గర్జించేను తలబడితే మేఘాలే..' అంటూ ఈ పాట సాగుతోంది. సంగీతం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ఏ.ఆర్. రెహమాన్ సంగీతాన్ని అందించాడు.
ar rehaman
SarvamThaalaMayam
Tollywood

More Telugu News