TRS: టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులపై వేటు!

  • రెబెల్ అభ్యర్థులపై టీఆర్ఎస్ అధిష్ఠానం కన్నెర్ర
  • వినోద్, నగేశ్, శంకర్, జలంధర్ రెడ్డి లు బహిష్కరణ
  • పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని వేటు
టీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడి రెబెల్స్ గా బరిలోకి దిగిన నేతలపై ఆ పార్టీ అధిష్ఠానం కన్నెర్ర జేసింది. టీఆర్ఎస్ రెబెల్స్ గా మారిన నలుగురు అభ్యర్థులను పార్టీ నుంచి బహిష్కరించారు. బెల్లంపల్లి నుంచి వినోద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి గజ్జెల నగేశ్, షాద్ నగర్ నుంచి శంకర్, మక్తల్ నుంచి జలంధర్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంగా వారిని బహిష్కరిస్తున్నట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. 
TRS
rebel
candidates

More Telugu News