Rahul Gandhi: రాహుల్ గాంధీ జోకర్ లా మాట్లాడుతున్నారు: కేసీఆర్

  • రాహుల్ కు దమ్ముంటే రుద్రమ్మకోటకు రావాలి
  • అక్కడి ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దాం
  • ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై ఇష్టమొచ్చినట్టు మాట్లాడొద్దు  
తెలంగాణలో ప్రాజెక్టులపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ ఘాటుగా సమాధానమిచ్చారు. రాహుల్ కు దమ్ముంటే రుద్రమ్మకోటకు రావాలని, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో చూద్దామని సవాల్ విసిరారు. తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సబబు కాదని రాహుల్ కు హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు చెప్పింది విని పిచ్చి ప్రాజెక్టులు పెట్టారని, వాటిని తీసేసి తమకు అవసరమైన ప్రాజెక్టులను మాత్రమే కట్టుకుంటున్నామని అన్నారు. తెలంగాణకు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకొచ్చే బాధ్యత తనదేనని, కేంద్రం మెడలు వంచైనా సరే, ఉక్కు ఫ్యాక్టరీని సాధించుకుంటామని అన్నారు.
Rahul Gandhi
kcr
illandu
TRS
Congress

More Telugu News