vijay devarakonda: జాన్వీతో సినిమా గురించి విజయ్ దేవరకొండ
- 'కాఫీ విత్ కరణ్'షోలో విజయ్ దేవరకొండ ప్రస్తావన
- కరణ్ జోహర్ తో సినిమా చేస్తాను
- 'టాక్సీవాలా'సమయంలో ఆయనను కలిశాను
ఒక వైపున బాలీవుడ్లో తొలి సినిమాతోనే హీరోయిన్ గా జాన్వీ మంచి పేరు సంపాదించుకుంది. మరో వైపున టాలీవుడ్లో విజయ్ దేవరకొండ స్టార్ స్టేటస్ కి చేరువవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల 'కాఫీ విత్ కరణ్' షోలో జాన్వీ మాట్లాడుతూ తనకి విజయ్ దేవరకొండ యాటిట్యూడ్ అంటే ఇష్టమని చెప్పింది. ఆయనతో ఒక సినిమా కూడా చేస్తానని చెప్పింది.
అప్పటి నుంచి విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి వెళ్లనున్నాడనీ, ఆయన హీరోగా .. జాన్వీ హీరోయిన్ గా కరణ్ జోహర్ ఒక సినిమా చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ విషయాన్ని గురించి విజయ్ దేవరకొండ దగ్గర ప్రస్తావించగా, 'ఆ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తా'అని ఆయన చెప్పాడు. 'టాక్సీవాలా' ప్రమోషన్స్ సమయంలో తాను కరణ్ జోహర్ ఆఫీసుకి వెళ్లినట్టుగా కూడా ఆయన చెప్పాడు. దాంతో ఇప్పుడు ఈ వార్త మరింత బలాన్ని పుంజుకుంది.