revanth reddy: మరోసారి హైకోర్టు మెట్లెక్కిన రేవంత్ రెడ్డి

  • భద్రత కల్పంచాలంటూ డివిజన్ బెంచ్ లో పిటిషన్
  • ప్రాణహాని ఉందని కోర్టుకు తెలిపిన రేవంత్
  • హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేసిందన్న కాంగ్రెస్ నేత
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరోసారి హైకోర్టు మెట్లెక్కారు. తనకు ప్రాణాపాయం ఉందని, తగినంత భద్రతను కల్పించాలని కోరుతూ డివిజన్ బెంచ్ లో పిటిషన్ వేశారు. తనకు భద్రత కల్పించాలంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం బేఖాతరు చేసిందని చెప్పారు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలంటే కేంద్ర హోంశాఖ, ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. 
revanth reddy
high court
congress

More Telugu News