vijayashanthi: కేసీఆర్ ఆ రెండింటికే పరిమితమయ్యారు: విజయశాంతి

  • ఫాంహౌస్, ప్రగతి భవన్ లకే పరిమితమయ్యారు
  • ప్రజా సంక్షేమాన్ని విస్మరించారు
  • టీఆర్ఎస్ ను ఇంటికి సాగనంపండి
నాలుగున్నరేళ్ల పాలనలో తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి విమర్శించారు. ఆయన కేవలం ఫాంహౌస్, ప్రగతి భవన్ లకే పరిమితమయ్యారని చెప్పారు. శేరిలింగంపల్లి మహాకూటమి (టీడీపీ) అభ్యర్థి భవ్య ఆనందప్రసాద్ కు మద్దతుగా ఆమె ప్రచారం నిర్వహించారు.

గచ్చిబౌలి నుంచి లింగంపల్లి కార్పొరేట్ కాలనీ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజా సంక్షేమాన్ని విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలని కోరారు. భవ్య ఆనందప్రసాద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఆనందప్రసాద్ మాట్లాడుతూ, అనునిత్యం ప్రజల మధ్యే ఉంటూ... సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.
vijayashanthi
kcr
bhavya anand prasad
TRS
congress
Telugudesam
serilingampalli

More Telugu News