modi: సౌదీ అరేబియా యువరాజుతో భేటీ అయిన మోదీ

  • అర్జెంటీనాలో జీ20 సమావేశాలు
  • మహ్మద్ బిన్ సల్మాన్ తో భేటీ అయిన మోదీ
  • పలు అంశాలపై చర్చలు జరిపామన్న మోదీ
సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ తో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. అర్జెంటీనాలో జరుగుతున్న జీ20 సమావేశాల సందర్భంగా ఇరువురు నేతలు భేటీ అయ్యారు. ఇంధనం, ఆర్థిక, సాంస్కృతిక తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడంపై చర్చించారు.

ఆహార భద్రతపై పెట్టుబడులను పెంచే అంశంపై ప్రధానంగా చర్చించారు. సౌదీ రాజుతో సమావేశంపై ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, మహ్మద్ బిన్ సల్మాన్ తో చర్చలు ఫలప్రదంగా సాగాయని చెప్పారు. ఇరు దేశాల సంబంధాలపై విస్తృతంగా చర్చించామని అన్నారు. ఇంధనం, ఆర్థిక, సాంస్కృతిక తదితర అంశాలపై లోతుగా చర్చలు జరిగాయని చెప్పారు. 
modi
saudi arabia
king
muhammed bin salman
g20
argentina
meet

More Telugu News