TRS: ఇంతకన్నా పెద్ద వ్యభిచారం ఎన్నడైనా చూశామా?: విజయసాయిరెడ్డి

  • టీఆర్ఎస్ కాదన్న తరువాతే టీడీపీతో పొత్తు
  • చంద్రబాబు పొత్తు గురించి అడిగారన్న కేటీఆర్
  • ఫేస్ బుక్ లో విమర్శలు గుప్పించిన విజయసాయి
తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ కాదన్న తరువాతనే చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నాడని, ఇంతకన్నా పెద్ద వ్యభిచారాన్ని ఎన్నడూ చూడలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు.

ఈ ఉదయం తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆయన, "సొంత బావమరిది, ఎన్టీఆర్ తనయుడు హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకుని చంద్రబాబు అక్కడే తనతో రాజకీయాలు మాట్లాడిన విషయాన్ని, తెలంగాణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలసి వెళతాం అని అడిగిన విషయాన్ని కేటీఆర్ బయటపెట్టారు. 

ఆగష్టు 14న రాహుల్ గాంధీతో బ్రాహ్మణి సమావేశం అయితే, ఆగష్టు 29న హరికృష్ణ మరణించారు. టీఆర్ఎస్ ఒప్పుకుని ఉంటే, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కలసి ఇదే చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ ను విమర్శించేవారు. టీఆర్ఎస్ ఒప్పుకోలేదు కాబట్టి కాంగ్రెస్ తో కలసి ఇప్పుడు టీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు. రాజకీయాల్లో ఇంతటి వ్యబిచారాన్ని ఇంతకు ముందు ఏనాడైనా చూశామా?" అని అన్నారు.
TRS
Vijayasai Reddy
Telugudesam
KTR
YSRCP

More Telugu News