Rahul Gandhi: రాహుల్ గాంధీ కోసం కొత్త గోత్రాన్ని సృష్టించిన బీజేపీ

  • రాహుల్ గోత్రంపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు  
  • తల్లి ఇటలీ దేశస్థురాలు కావడంతో ఇకపై ఆయన గోత్రం ‘ఇట్లుస్’
  • రాహుల్‌కు అసలు గోత్రమే లేదన్న రాజస్థాన్ సీఎం
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గోత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కారణమైంది. ఆయన గోత్రాన్ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ విమర్శల డోసు పెంచింది. ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ అక్కడి పుష్కర లేక్‌లో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడి పురోహితుడికి తనది దత్తాత్రేయ గోత్రమని చెప్పారు.

రాహుల్ గోత్రం చెప్పడాన్ని బీజేపీ ఎద్దేవా చేసింది. ఆయనకు అసలు గోత్రమే లేదని, రాహుల్ తాత హిందువు కాదని, ఆయన పార్సీ అని, వారికసలు గోత్రమే లేదని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే కూడా రాహుల్ గోత్రం చెప్పడాన్ని ఎద్దేవా చేశారు. రాహుల్ చెబుతున్న గోత్రం ఆయనది కాదని, అది జవహర్ లాల్ నెహ్రూదని పేర్కొన్నారు.

తాజాగా, ఉత్తరప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు మహేంద్రనాథ్ పాండే మాట్లాడుతూ.. గోత్రం లేని రాహుల్‌కు తాము కొత్త గోత్రాన్ని సృష్టించినట్టు చెప్పారు. ఆయన తల్లి ఇటలీ దేశస్తురాలు కావడంతో అది కలిసి వచ్చేలా ‘గోత్రా ఇట్లుస్’ గా నామకరణం చేసినట్టు చెప్పారు.
Rahul Gandhi
BJP
gotra
Itlus
Mahendra Nath Pandey
Rajasthan

More Telugu News