Jagan: జగన్ పాపం చేశాడు... సీఎం కాలేడు: పవన్ కల్యాణ్

  • దేవుడు జగన్ ను క్షమించే అవకాశం లేదు
  • తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదన
  • అమలాపురం సభలో పవన్ కల్యాణ్
జగన్ చేసిన పాపాలు ఆయన్ను వెంటాడుతున్నాయని, దేవుడు ఆయన్ను క్షమించే అవకాశం లేదని, ఆయన సీఎం కాలేడని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిన్న రాత్రి అమలాపురం గడియార స్తంభం వద్ద జరిగిన సభలో మాట్లాడిన ఆయన, తన తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని, అడ్డగోలుగా ప్రజా ధనాన్ని కాజేసిన జగన్ ను దేవుడెలా కరుణిస్తాడని ప్రశ్నించారు. జగనేమీ దేశం కోసం పోరాడిన మండేలా మాదిరిగా జైలుకు వెళ్లలేదని, లక్షన్నర కోట్లు సంపాదించుకుని జైలుకు వెళ్లాడని పవన్ కల్యాణ్ విమర్శలు గుప్పించారు.

ఓ చిన్న కోడికత్తి గుచ్చుకుంటే దాన్ని పెద్ద విషయంలా రాద్ధాంతం చేస్తున్నారని, ఈ తరహా చిల్లర రాజకీయాలతో ప్రజలకు దగ్గర కాలేరని అన్నారు. అవినీతిరహిత పాలనను అందించాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. నాడు చంద్రబాబును నమ్మి మద్దతిచ్చానని, కానీ, ఆయన ఇప్పుడు 'అవినీతికి కింగ్'గా మారారని నిప్పులు చెరిగారు. చంద్రబాబు పాపం కూడా పండిందని, ఆయన కూడా అధికారానికి దూరం కానున్నారని, వచ్చేది జనసేన ప్రభుత్వమేనని అంచనా వేశారు.
Jagan
Pawan Kalyan
Sins
Chandrababu

More Telugu News