stock market: వరుసగా నాల్గో రోజు లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

షార్ట్స్‌లో చూడండి
ఈరోజు స్టాక్ మార్కెట్లు కూడా లాభాలతో ముగిశాయి. వరుసగా నాల్గో రోజు లాభాలను దక్కించుకున్నాయి. బీఎస్ఈ 36 వేల మైలు రాయిని మరోసారి అందుకుంది. నిఫ్టీ కూడా 10,800  పాయింట్లకు పైగా స్థిరపడింది. ఆర్థిక రంగాల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు భారీ లాభాలను పొందాయి. దీంతో పాటు డాలర్ తో రూపాయి మారకం విలువ బలపడటం కూడా కలిసొచ్చినట్టయింది. బీఎస్ఈ 453 పాయింట్ల లాభంతో 36,170 పాయింట్ల వద్ద, నిఫ్టీ 130 పాయింట్లు లాభపడి 10,859 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి.  
Go Back to Shorts
stock market
sensex
nifty

More Telugu News