‘తెలంగాణ’లో మేము అధికారంలో కొస్తే యూపీ తరహాలో యువతకు ఉపాధి కల్పిస్తాం: మాయావతి
- మా పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది
- మా పార్టీ తప్ప, అన్ని పార్టీలవి బూటకపు మేనిఫెస్టోలే
- నాడు యువతకు ‘నిరుద్యోగ భృతి’ కాకుండా ఉపాధి కల్పించాం
త్వరలో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తోందని, ఏ పార్టీతోనూ తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలో కొస్తే యూపీ తరహాలో ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యూపీలో తమ హయాంలో యువతకు ‘నిరుద్యోగ భృతి’ కాకుండా ఉపాధి కల్పించామని చెప్పారు. కేవలం, తమ పార్టీ తప్ప, అన్ని పార్టీలు బూటకపు మేనిఫెస్టోలతో ప్రజలను మోసం చేస్తున్నాయని మాయావతి విమర్శించారు.