nizamabad: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో ‘కాంగ్రెస్’ గెలుపు ఖాయమం: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • మేము అధికారంలో కొస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం
  • మహిళా సాధికారతకు పెద్ద పీట వేశాము  
  • కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క మహిళకూ స్థానం కల్పించలేదు!
త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో మహాకూటమి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, తాము అధికారంలోకొస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని, మొదటి ఏడాదిలో లక్ష ఉద్యోగాలు ఇస్తామని, కేజీ టూ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చేస్తామని, మెగా డీఎస్సీ నిర్వహిస్తామని, మహిళా సంఘాలను బలోపేతం చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం కల్పించలేదని విమర్శించారు. మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వాలు పెద్దపీట వేశాయని గుర్తుచేశారు.
nizamabad
armur
Rahul Gandhi
Uttam Kumar Reddy

More Telugu News