KTR: రాహుల్, చంద్రబాబు, అమిత్ వస్తారు, పోతారు... ఉండేది కేసీఆర్ మాత్రమే: కేటీఆర్

  • రాజకీయ నేతలంతా టూరిస్టులే
  • వస్తుంటారు, పోతుంటారు
  • ట్విట్టర్ లో కేటీఆర్
తెలంగాణకు వచ్చి వెళ్లే రాజకీయ నాయకులంతా టూరిస్టుల వంటి వారని, ఇక్కడ ఉండేది కేసీఆర్ ఒక్కరేనని తెలంగాణ రాష్ట్ర సమితి యువనేత కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెడుతూ, దేశంలోని రాజకీయా నాయకులంతా ఇప్పుడు తెలంగాణలోనే ఉన్నారని అన్నారు. "రాజకీయ టూరిస్టుల మాదిరిగా నరేంద్ర మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, చంద్రబాబునాయుడు వస్తున్నారు, పోతారు. కానీ కేసీఆర్ ఇక్కడే ఉండి పని చేస్తారు. దేశంలోని టాప్ పొలిటికల్ లీడర్స్ ఇక్కడ క్యూ కడుతున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు.
KTR
Chandrababu
Rahul Gandhi
Amit shah
Twitter
KCR

More Telugu News