Andhra Pradesh: పవన్ కల్యాణ్ నాపై అనవసర విమర్ళలు చేయడం మానుకోవాలి!: టీడీపీ ఎంపీ మురళీమోహన్

  • బీజేపీ అత్యాశ పెరిగిపోయింది
  • అందుకే చంద్రబాబును దూరం చేసుకున్నారు
  • ఇందుకు మూల్యం చెల్లించుకోకతప్పదు
అహంకారంతోనే ప్రధాని నరేంద్ర మోదీ టీడీపీని దూరం చేసుకున్నారని టీడీపీ పార్లమెంటు సభ్యుడు మురళీమోహన్ విమర్శించారు. ఇందుకు బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దక్షిణ భారతదేశంలో విస్తరించాలని అనుకుంటున్న బీజేపీ కోరిక నెరవేరబోదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై అవనసర విమర్శలు చేయడం మానుకోవాలని మురళీమోహన్ సూచించారు. బీజేపీకి ఇటీవలికాలంలో అత్యాశ పెరిగిందని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలన్నింటిని మట్టి కరిపించాలని బీజేపీ ఆలోచిస్తోందన్నారు. కాంగ్రెస్ కంటే బీజేపీనే దేశానికి చాలా నష్టం కలగజేసిందన్నారు. రాబోయే 3 నెలల్లో దేశ రాజకీయాల్లో చాలా మార్పులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు.
Andhra Pradesh
Pawan Kalyan
Chandrababu
BJP
Narendra Modi

More Telugu News