thilak: పవన్ కల్యాణ్ గొప్పతనం అదే: సీనియర్ నటుడు తిలక్

  • పవన్ మొదటి సినిమాలో చేశాను 
  • ఆయన నన్ను గుర్తుపెట్టుకున్నారు 
  • పవన్ మంచి మనసున్న మనిషి
ఎన్టీఆర్ .. ఎన్నార్ .. కృష్ణ .. శోభన్ బాబు వంటి అగ్రకథానాయకుల సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలను తిలక్ పోషించారు. ఇప్పటికీ ఆయన తన కెరియర్ ను కొనసాగిస్తూనే వున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. "పవన్ కల్యాణ్ తో కలిసి నేను 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమాలో నటించాను. ఆ సినిమాలో నేను పెళ్లిళ్ల పేరయ్య గా కనిపిస్తాను.

ఆ విషయాన్ని ఆయన గుర్తుపెట్టుకుని, 'సర్దార్ గబ్బర్ సింగ్' సినిమాలో ఒక పాత్ర కోసం నన్ను సిఫార్స్ చేసి పిలిపించారు. 'సర్దార్ గబ్బర్ సింగ్'లో నాతో ఒక మంచి వేషం వేయించారు. ఆయనతో కలిసి నటించి ఎంతో కాలమైనా గుర్తుపెట్టుకుని పిలిపించడం ఆయన గొప్పతనం. పవన్ కల్యాణ్ ను చాలా దగ్గరగా చూడటం వలన, ఆయన చాలా ముక్కుసూటి మనిషి .. మంచి మనసున్న మనిషి అనే విషయం నాకు అర్థమైంది" అని చెప్పుకొచ్చారు.
thilak

More Telugu News