Telangana: రాహుల్ ను అల్పాహారానికి ఆహ్వానించిన చంద్రబాబు.. మరికాసేపట్లో పార్క్ హయత్ లో భేటీ!

  • ఖమ్మం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నేతలు
  • రాజకీయ కార్యాచరణపై నేడు మరోసారి చర్చ
  • బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పాల్గొనే అవకాశం
తెలంగాణ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు అల్పాహారానికి ఆహ్వానించారు. ఖమ్మంలో నిన్న జరిగిన మహాకూటమి బహిరంగ సభలో ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పై రాజకీయ దాడిని ముమ్మరం చేయడంలో భాగంగా చంద్రబాబు, రాహుల్ నేడు మరోసారి సమావేశం కానున్నారు.

కాగా, మరికాసేపట్లో రాహుల్ గాంధీ, చంద్రబాబు హైదరాబాద్ పార్క్ హయత్ హోటల్ లో భేటీ కానున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ వచ్చిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయవతి కూడా పార్క్ హయత్ లోనే దిగారు. ఈ నేపథ్యంలో రాహుల్, చంద్రబాబుతో మాయావతి సమావేశమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Telangana
elections-2018
Chandrababu
Rahul Gandhi
mayavati
maha kutami
breakfast

More Telugu News