Hyderabad: అదృశ్యమైన చంద్రముఖి ఆచూకీ లభ్యం!

  • గోషామహల్ నుంచి బీఎల్ఎఫ్ అభ్యర్థిగా పోటీ
  • మంగళవారం అదృశ్యమైన చంద్రముఖి
  • కనిపెట్టిన హైదరాబాద్ పోలీసులు
హైదరాబాద్ పరిధిలోని గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఎల్ఎఫ్ తరఫున బరిలోకి దిగిన ట్రాన్స్ జండర్ చంద్రముఖి అదృశ్యం ఉదంతం సుఖాంతమైంది. గత అర్ధరాత్రి ఇందిరానగర్ లో చంద్రముఖి ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, ఆమెను అదుపులోకి తీసుకుని న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టారు.

మంగళవారం ఉదయం 8 గంటల తరువాత ఆమె తన సహచరులకు కనిపించకపోవడంతో, ఆమె తల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. చంద్రముఖి అదృశ్యంపై హైకోర్టు స్పందిస్తూ, ఆమెను గురువారం మధ్యాహ్నానికి కోర్టు ముందు హాజరు పరచాలని కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆమెను పోలీసులు వెతికి పట్టుకున్నారు.  
Hyderabad
Goshamahal
Chandramukhi

More Telugu News