Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • కాజల్ 'కవచం' సిద్ధమవుతోంది! 
  • '96'కి అల్లు అర్జున్ ఓకే అంటాడా?   
  • 'ముద్ర'కు డబ్బింగ్ చెబుతున్న నిఖిల్
*  బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలసి అందాలతార కాజల్ నటించిన 'కవచం' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు.
*  ఇటీవల తమిళంలో వచ్చిన హిట్ చిత్రం '96'ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్ కి దర్శకత్వం వహించిన ప్రేమకుమార్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తాడు. ఇందులో హీరో పాత్రధారి కోసం నిర్మాత పలు పేర్లను పరిశీలిస్తున్నాడు. అయితే, ఈ పాత్ర నచ్చడంతో  చేయడానికి అల్లు అర్జున్ ఆసక్తిని చూపుతున్నట్టు వార్తలొస్తున్నాయి.  
*  యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న 'ముద్ర' చిత్రం  షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిఖిల్ తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నాడు. ఇటీవల వచ్చిన 'కిరాక్ పార్టీ' ఫ్లాపవడంతో డిసెంబర్ 28న రానున్న ఈ 'ముద్ర'పైనే నిఖిల్ ఆశలు పెట్టుకున్నాడు.
Kajal Agarwal
nikhil
Allu Arjun

More Telugu News