Anand sharma: బీజేపీ, టీఆర్ఎస్‌ల వద్ద నగదు పుష్కలంగా ఉంది: ఆనంద్ శర్మ

  • మోదీ ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తున్నారు
  • కార్పొరేట్ కంపెనీలకు దీటుగా ప్రకటనలకు ఖర్చు
  • టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం
బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య ఓ సారూప్యత ఉందని... రెండు పార్టీల వద్ద పుష్కలంగా నగదు ఉందని కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌శర్మ తెలిపారు. నేడు ఆయన గాంధీ‌భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో మోదీ ప్రచారానికి భారీగా ఖర్చు చేస్తున్నారని.. కార్పొరేట్ కంపెనీలకు దీటుగా ప్రకటనలకు ఖర్చు పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజలు పేదవారని.. ఇప్పటికి మూడు కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారన్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్, బీజేపీల మధ్య రహస్య ఒప్పందం కుదిరిందని ఆనంద్ శర్మ ఆరోపించారు. గత ఎన్నికల్లో గెలిచిన ఐదు సీట్లను కూడా బీజేపీ ఈ ఎన్నికల్లో గెలవదని జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమన్నారు.
Anand sharma
BJP
Narendra Modi
Corporate Companies
Congress

More Telugu News