Kodandaram: సనత్ నగర్ లో తలసాని ఓడిపోవడం ఖాయం: కోదండరాం

  • మహాకూటమికి తలసాని జీ హుజూర్ అనాల్సిందే
  • నిరంకుశంగా పాలిస్తామంటే ప్రజలు తిరగబడతారు
  • నగరంలో ప్రతి ఒక్కరి ఇంటి కల నెరవేరాలి
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహాకూటమికి జీ హుజూర్ అనాల్సిందేనని టీజేఎస్ అధినేత కోదండరాం అన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో ఆయన ఓటమి ఖాయమని... మహాకూటమి విజయం తథ్యమని చెప్పారు. ఈరోజు సనత్ నగర్ లో మహాకూటమి ఎన్నికల ప్రచార సభను నిర్వహించింది. ఈ సభకు రాహుల్, చంద్రబాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, కేసీఆర్ పాలనపై మండిపడ్డారు. నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. హైదరాబాదులో వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలు మమేకమయ్యారని... ఇక్కడి పాలన ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని అన్నారు. నిరంకుశంగా పాలిస్తామంటే ప్రజలు తిరగబడతారని చెప్పారు. నగరంలో ప్రతి ఒక్కరి ఇంటి కల నెరవేరాలని ఆకాంక్షించారు.
Kodandaram
prajakutami
tjs
Talasani
sanath nagar
kcr
TRS
Hyderabad

More Telugu News