Priyanka Chopra: ప్రియాంక, నిక్ జంట పెళ్లి సంరంభం.. అతిథులకు ఇవ్వాల్సిన కానుకలు రెడీ!

  • 2, 3 తేదీల్లో ప్రియాంక, నిక్‌ల పెళ్లి
  • ముంబైకి చేరుకున్న నిక్
  • ప్రియాంక నివాసంలో ముగిసిన పూజ
  • అతిథులకు కానుకగా వెండి నాణేలు
ప్రియాంక చోప్రా, నిక్ జొనాస్‌ల పెళ్లి వేడుక మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. రాజస్థాన్‌లోని ఉమైద్ భవన్ ప్యాలెస్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరగనుందని సమాచారం. దీనికోసం ప్యాలెస్‌ను ఐదు రోజులకు బుక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ 2, 3 తేదీల్లో ప్రియాంక, నిక్ పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఏర్పాట్లు, అతిథులకు ఇవ్వాల్సిన కానుకలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. నిక్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులతో కలిసి ముంబైకి చేరుకున్నారు.

నేడు ప్రియాంక నివాసంలో పూజ నిర్వహించినట్టు సమాచారం. గురువారం ప్యాలెస్‌లో మెహందీ, సంగీత్, శుక్రవారం పార్టీ, శనివారం పెళ్లి కూతురు, పెళ్లి కుమారుడికి పసుపు రాసే కార్యక్రమం నిర్వహించనున్నారని సమాచారం. ఇక కాబోయే వధూవరులు ఇప్పటికే అతిథులకు ఇవ్వాల్సిన కానుకల్ని ప్రత్యేకంగా సిద్ధం చేయించారట. వీరు వెండి నాణేలను బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ వెండి నాణేలపై ఒకవైపు ‘ఎన్‌పీ’(నిక్, ప్రియాంక) అని రాసి ఉండగా మరోవైపు గణేష్, లక్ష్మీదేవి ప్రతిమలను పొందుపరిచారట. ప్రస్తుతం ఈ వెండి నాణేలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Priyanka Chopra
Nick Zonas
Rajasthan
Umid Bhava Palace
Mumbai
Silver Coins

More Telugu News