kamal: 'భారతీయుడు 2' కోసం కమల్ లుక్ సెట్ చేసేశాను: శంకర్

  • కమల్ ఇప్పుడూ అలాగే కనిపించనున్నారు
  • ఆయన ఫిట్ నెస్ చూసి ఆశ్చర్యపోయాను 
  • త్వరలోనే పనులు ఊపందుకుంటాయి  
శంకర్ దర్శకత్వం వహించిన '2.ఓ' .. రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రమోషన్స్ లో శంకర్ బిజీగా వున్నాడు. తాజా ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ 'భారతీయుడు 2' గురించి ప్రస్తావించారు. "భారతీయుడు 2'కి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 'సేనాపతి' పాత్రకి గాను కమలహాసన్ పై మరో మారు టెస్ట్ షూట్ చేసి, ఆయన లుక్ ను సెట్ చేశాము.

పాతిక సంవత్సరాల క్రితం 'భారతీయుడు'లో కమల్ ఎలా కనిపించారో .. ఈ సినిమాలోను ఆయన అలాగే కనిపించనున్నారు. కమల్ ఎనర్జీ .. ఆయన ఫిట్ నెస్ చూసి నేను ఆశ్చర్యపోయాను. 'భారతీయుడు'లో ఆనాటి సమస్యలు చర్చించినట్టే, 'భారతీయుడు 2'లో ఈనాటి సమస్యలు చర్చించడం జరుగుతుంది. '2.ఓ' విడుదలైన కొన్ని రోజుల్లోనే 'భారతీయుడు 2' కి సంబంధించిన పనులు ఊపందుకుంటాయి" అని స్పష్టం చేశాడు.       
kamal
shankar

More Telugu News